![]() |
![]() |
.webp)
కేవలం సినిమాల్లోనే కాకుండా.. మ్యూజికల్ షోస్‌లో సైతం సింగర్ దామిని పాటలు పాడుతుంటుంది. మార్చి 16 హైదరాబాద్ గండిపేటలో ఎక్స్ ఫెస్టివల్ పేరుతో భారీ మ్యూజికల్ షోని నిర్వహించబోతున్నారు. ఈ మ్యూజికల్ షోలో తన ఆట పాటలతో అలరించబోతుంది దామిని. కాగా ఈ మ్యూజిక్ షోకి సంబంధించి పోస్టర్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేసింది దామిని.
బిగ్ బాస్ హౌస్ లో సింగర్ గా ఎంట్రీ ఇచ్చి తనకి నచ్చినట్టుగా ఉండటంతో తొందరగా బయటకొచ్చేసింది. అతిగా ఆవేశపడేవాళ్లు, అనవసరంగా వాదిస్తూ సాగదీసేవాళ్లు, తమ డప్పు తామే కొట్టుకునేవాళ్లు, కేవలం డైలాగులకే పరిమితమయ్యేవాళ్లు, వెనకాల గోతులు తవ్వేవాళ్లు, కిచెన్‌కే పరిమితమై ఆడటమే మర్చిపోయేవాళ్లు.. ఇలా ప్రతిసీజన్‌లోనూ ఇలాంటి వాళ్లున్నారు. సీజన్ సెవెన్ లో అలాంటివారున్నారు. అయితే మిగతావాళ్ల సంగతి ఎలా ఉన్నా కిచెన్‌కే పరిమితమైనవాళ్లు మాత్రం హౌస్‌లో ఎక్కువ వారాలు ఉన్న దాఖలాలు లేవు. అందుకేనేమో దామిని త్వరగా బయటకొచ్చేసింది. మూడో వారంలో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఓ టాస్క్‌లో భాగంగా యావర్‌ని దారుణంగా హింసపెట్టి.. నెగిటివిటీని మూటకట్టుకుంది. ఇక ఓవర్ ఎక్స్ పోజింగ్ విషయంలోనూ ఫ్యామిలీ ఆడియన్స్‌కి దూరమైంది దామిని.
తాజాగా తను పాడిన ప్రేమలేఖ పాటని అఫీషియల్ గా విడుదల చేసిన దామిని.. వ్యాయామం పేరుతో ఓ కోర్స్ ని ఫాలో అవుతుంది. డైట్ ప్లాన్ కి సంబందించిన ఫుడ్, వర్కవుట్
ఫోటోలు, అప్లోడ్ చేస్తుంది. అయితే త్వరలో మొదలయ్యే మ్యూజిక్ లైవ్ షోకి తను వెళ్తున్నట్టుగా ఓ పోస్టర్ ని తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో విడుదల చేయగా అది ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారింది.
![]() |
![]() |